హైదరాబాద్, ధరణి న్యూస్, సెప్టెంబర్ 17 : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సి.ఎమ్.సి) ప్రధాన కార్యాలయంలో ‘ప్రజా పాలన దినోత్సవం’ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సి.ఎమ్.సి కమిషనర్తోపాటు వివిధ విభాగాల అధిపతులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో కమిషనర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ చారిత్రక ప్రస్థానంలో కీలక పాత్ర పోషించి, ప్రజాస్వామ్య వ్యవస్థ స్థాపనకు కృషి చేసిన స్వాతంత్ర్య సమరయోధులు, అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ… 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమై ప్రజాస్వామ్య పాలనకు బాటలు పడిందని గుర్తుచేశారు. ఆ అమరుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు ప్రజా సేవ, ప్రజల భాగస్వామ్యం, సమానత్వంతో పారదర్శకమైన, బాధ్యతాయుతమైన పాలనా సూత్రాలకు కట్టుబడి పనిచేయడమే ఈ వేడుకల ముఖ్య ఉద్దేశమని ఈ సందర్బంగా వారు స్పష్టం చేశారు.