తెలంగాణలో వైభవంగా పూర్ణాహుతితో ముగిసిన వరుణయాగం

Dharani News
1 Min Read

హైదరాబాద్, ఆగష్టు 10 : రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన మహా వరుణయాగం వైదిక మంత్రోచ్ఛారణలు, శాస్త్రోక్త పూజల నడుమ భక్తిశ్రద్ధలతో పూర్ణాహుతితో ఘనంగా ముగిసింది. నాగార్జునసాగర్‌లోని విజయవిహార్ వద్ద కృష్ణానది తీరాన జరిగిన ఈ యాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొని రుత్విక్కుల సంప్రదాయ మార్గదర్శకత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకులు 108 మంది వైదిక పండితుల ఆధ్వర్యంలో 11 హోమగుండాలతో ఈ యాగం రూపుదిద్దుకుంది. ఇందులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, కే. జానారెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సాంకేతిక, శాస్త్రీయ ప్రణాళికలతో ముందుకెళ్తూనే ప్రకృతిని పూజించే భారతీయ సంప్రదాయానికి అనుగుణంగా ఈ యాగాన్ని తలపెట్టినట్లు సీఎం పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి బేసిన్ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసి శ్రీశైలం, నాగార్జునసాగర్ సహా అన్ని ప్రాజెక్టులు, చెరువులు జలకళతో తొలకడించాలని రైతాంగం పంటలతో వర్ధిల్లాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రార్థించారు.

📄 Generate e-Paper Clip
Share This Article