హైదరాబాద్, ఆగష్టు 11 : దేశంలో త్వరలోనే ప్లాస్టిక్ (పాలిమర్) కరెన్సీ నోట్లు అందుబాటులోకి రానున్నాయి. రూ. 10,20 ముఖ విలువ కలిగిన 100 కోట్ల (ఒక బిలియన్) పాలిమర్ నోట్లను ప్రయోగాత్మకంగా (ఫీల్డ్ ట్రయల్స్) చలామణీలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.కాగితం నోట్లతో పోలిస్తే ప్లాస్టిక్ నోట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని, నకిలీ నోట్ల ముద్రణను అరికట్టడానికి వీలవుతుందని అధికారులు వెల్లడించారు. ఎంచుకున్న ఐదు వేర్వేరు వాతావరణ పరిస్థితులు ఉన్న నగరాల్లో ఈ నోట్లను ప్రయోగాత్మకంగా చలామణీ చేసి వాటి ఫలితాల ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.