శంకర్‌పల్లి మోడల్ స్కూల్ కళాశాలలో జులై 1న స్పాట్ అడ్మిషన్లు

Dharani News
1 Min Read

శంకర్ పల్లి : శంకర్‌పల్లి మండల కేంద్రంలోని పీఎం తెలంగాణ మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాలలో మిగిలిపోయిన ఇంటర్మీడియట్ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శోభారాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.విద్యా సంవత్సరం 2026-27 గాను అందుబాటులో ఉన్న గ్రూపులు ఎంపీసీ (MPC), బైపీసీ (BiPC), సీఈసీ (CEC), మరియు ఏసీఈ (ACE) స్పాట్ అడ్మిషన్ల తేదీ జులై 1 న జరుగుతాయి అని తెలిపారు. ఈ స్పాట్ అడ్మిషన్ల ద్వారా ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా కళాశాలకు హాజరుకావాలని ప్రిన్సిపాల్ సూచించారు 1. పదో తరగతి మార్కుల మెమో (10th Marks Memo) 2. బదిలీ సర్టిఫికేట్ (TC) 3. బోనఫైడ్ సర్టిఫికేట్ (Bonafide Certificate)అర్హత, ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

📄 Generate e-Paper Clip
Share This Article