రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

Dharani News
1 Min Read

*బండ రావిరాల డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగాముట్టడి

రంగారెడ్డి : రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఈరోజు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బండ రావిరాల గ్రామం వద్ద నిర్మించతలపెట్టిన డంపింగ్ యార్డ్ వల్ల స్థానికంగా కాలుష్యం పెరిగి, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందంటూ పలు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కలెక్టరేట్‌ను ముట్టడించారు. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తరలివచ్చిన ఆందోళనకారులను కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే, ఆగ్రహంతో ఉన్న ప్రజలు పోలీసుల బారికేడ్లను తోసుకుంటూ ఒక్కసారిగా లోపలికి పరుగులు తీశారు. అనంతరం కలెక్టర్ ప్రధాన కార్యాలయం ముందే బైఠాయించి పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేయగా, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు.

📄 Generate e-Paper Clip
Share This Article