పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్

Dharani News
1 Min Read

శేరిలింగంపల్లి, ధరణి న్యూస్, సెప్టెంబర్ 11 : పర్యావరణ పరిరక్షణలో సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడం మనందరి బాధ్యతని హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్ అన్నారు. హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చందానగర్‌లోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ ప్రాంగణంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. పర్యావరణహిత వినాయక చవితిని జరుపుకోవాలనే ఉద్దేశంతో శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన ఆర్యవైశ్యులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కెమికల్ రంగులతో చేసే విగ్రహాల వల్ల జల వనరులు కలుషితమవుతాయని, అందరూ మట్టి వినాయకులనే పూజించి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ శేరిలింగంపల్లి అధ్యక్షుడు ప్రభాకర్, కార్యదర్శి పోలా కోటేశ్వర్ రావు, గుప్తా రియాల్టీ అధినేత శ్రీనివాస్ గుప్తా, మారం వేంకటేశ్వర్లు గుప్తా, అర్ధం లక్ష్మయ్య, బీయస్ లింగం, సిల్వర్ రేఖ, ఎం.ఎన్. బాబు, పృథ్వి, శ్రీకాంత్, నర్సింహ్మ, నాగ మల్లేష్, సుధాకర్, రమేష్, ఉషారాణి, జితమన్యు, రవి కిరణ్ లతో పాటు పెద్ద సంఖ్యలో స్థానికులు, భక్తులు పాల్గొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article