చేవెళ్ల, ధరణి న్యూస్, సెప్టెంబర్ 17: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల డివిజనల్ సబ్ ట్రెజరీ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఒక పనికి సంబంధించి బాధితుడి నుంచి రూ. 1,00,000 లంచం తీసుకుంటుండగా సంబంధిత అధికారులను ఎసిబి బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. బాధితుని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేసి లంచం డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కార్యాలయంలోని రికార్డులను పరిశీలిస్తూ విచారణ వేగవంతం చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.