చెన్నైలో దారుణం: కెనడా మహిళకు సైబర్ వల.. నగ్న పూజల పేరిట రికార్డు చేసి బ్లాక్‌మెయిల్

Dharani News
1 Min Read

తమిళనాడు, ధరణి న్యూస్ : తమిళనాడు రాజధాని చెన్నైలో విదేశీ పర్యాటకురాలిని నమ్మించి మోసం చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కెనడాకు చెందిన 37 ఏళ్ల మహిళ పర్యటన నిమిత్తం చెన్నై రాగా బెసెంట్ నగర్ బీచ్‌లో చిలుక జోస్యం చెప్పే ఇసక్కిముత్తు అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే ప్రత్యేక పూజలు చేయాలని వీడియో కాల్ ద్వారా నగ్నంగా ఈ పూజలో పాల్గొనవచ్చని ఆమెను నమ్మబలికాడు. అతని మాటలు నమ్మి సదరు మహిళ వీడియో కాల్‌లో పాల్గొనగా దానికిగానూ రూ.20,000 వసూలు చేయడమే కాకుండా ఆ పూజనంతా తన ఫోన్‌లో రికార్డు చేశాడు. అనంతరం ఆ నగ్న వీడియో ఆధారంగా మరింత డబ్బులు ఇవ్వాలని లేకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో తా తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు మాంబలం పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు ఇసక్కిముత్తును అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article