హైదరాబాద్ : యూట్యూబ్ స్టార్‌గా, ఫోక్ సింగర్‌గా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ క్రేజ్ తెచ్చుకున్న తెలంగాణ అమ్మాయి నాగదుర్గ వెండితెర హీరోయిన్‌గా బిజీ కాబోతున్నారు. “దారిపొంటె పోతుండు”, “నా పేరు ఎల్లమ్మ” వంటి జానపద గీతాలతో యూట్యూబ్‌లో కోట్లాది వ్యూస్ రాబట్టిన ఆమె, తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఒక సినిమాలో తనకు కీలకమైన పాత్ర చేసే అవకాశం వచ్చిందని, అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఛాన్స్ వదులుకోవాల్సి వచ్చిందని నాగదుర్గ తెలిపారు. “పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం రావడం నా అదృష్టం, కానీ ఆ సమయంలో ఉన్న పరిస్థితుల వల్ల ‘నా వల్ల కాదు’ అని చెప్పాల్సి వచ్చింది అంటూ ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈమె కథానాయికగా కొన్ని చిత్రాల్లో నటిస్తూ సినిమా రంగంలో బిజీ అవుతున్నారు.