dharaninews.com Daily News – Andhra, Telangana, Business & Breaking News › పెళ్లి పేరిట రూ. 12 లక్షల మోసం: డీ 10… › e-Paper Clip dharaninews.com Daily News – Andhra, Telangana, Business & Breaking News
Share: f 𝕏 ✉ ✈ in @ 📱 WhatsApp
Date of Publish : 13 Sep 2026, 10:37 am  |  Posted by : DHARANI NEWS
👁 38 💬 0
Crime

పెళ్లి పేరిట రూ. 12 లక్షల మోసం: డీ 10 డ్యాన్సర్ రాజుపై కేసు నమోదు​

పెళ్లి పేరిట రూ. 12 లక్షల మోసం: డీ 10 డ్యాన్సర్ రాజుపై కేసు నమోదు​

మియాపూర్, ధరణి న్యూస్, సెప్టెంబర్ 13 : పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లొంగదీసుకోవడమే కాకుండా రూ. 12 లక్షల వరకు నగదు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఘటనపై మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం... శేరిలింగంపల్లి గోకుల్ ప్లాట్స్ పరిధిలోని ఓ భవనంలో బొటిక్ నిర్వహిస్తున్న 28 ఏళ్ల బాధితురాలికి అదే భవనంలోని డ్యాన్స్ స్టూడియోకి వచ్చి వెళ్లే రాజు తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కొద్దిరోజుల్లోనే ప్రేమగా మారి పెళ్లి చేసుకుంటానని నమ్మించిన రాజు మే 2024 నుండి బాధితురాలిని పలుమార్లు శారీరకంగా లొంగదీసుకున్నాడు. అంతేకాకుండా విడతల వారీగా ఫోన్ పే మరియు క్యాష్ ద్వారా సుమారు రూ. 12,00,000 వసూలు చేశాడు. ఆ తర్వాత పెళ్లి ప్రస్తావన వచ్చినపుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని దాటవేస్తూ వచ్చాడు. రాజు ఇలాగే మరికొందరు మహిళలను కూడా పెళ్లి పేరుతో నమ్మించి డబ్బులు తీసుకుని మోసం చేసినట్లు బాధితురాలికి తెలిసింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు మియాపూర్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు రాజుపై BNS 69, 318(4) సెక్షన్ల కింద క్రైమ్ నంబర్ 1307/2026 తో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.