న్యూ ఢిల్లీ, ఆగష్టు 10 : దక్షిణామెరికా దేశమైన బొలీవియా ప్రజారోగ్య రంగానికి చేయూతనందించేందుకు భారత్ 8 మెట్రిక్ టన్నుల అత్యవసర, జీవిత రక్షణ ఔషధాల (Life-saving medicines) సహాయాన్ని పంపింది.‘గ్లోబల్ సౌత్’ (Global South) భాగస్వామ్య దేశాలకు మద్దతుగా నిలిచే క్రమంలో ఈ చర్య చేపట్టినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది. పరస్పర సహకారం, సంఘీభావం ఉమ్మడి సంక్షేమం దిశగా సహాయం అందించేందుకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని పేర్కొంది. ఇటీవలి కాలంలో భారత్ - బొలీవియాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం, విజ్ఞాన సాంకేతికత ఇంధన రంగాల్లో భాగస్వామ్యం బలోపేతమవుతున్న తరుణంలో భారత్ అందించిన ఈ మానవతా సాయం ఇరు దేశాల స్నేహబంధాన్ని మరింత పటిష్టం చేయనుంది.