dharaninews.com Daily News – Andhra, Telangana, Business & Breaking News › సినీ నటి శృతి హాసన్ సందడి నల్లగండ్లలో ‘శుభప్రదం షాపింగ్… › e-Paper Clip dharaninews.com Daily News – Andhra, Telangana, Business & Breaking News
Share: f 𝕏 ✉ ✈ in @ 📱 WhatsApp
Date of Publish : 03 Jul 2026, 2:41 pm  |  Posted by : DHARANI NEWS
👁 82 💬 0
Celebrity News > Hyderabad

సినీ నటి శృతి హాసన్ సందడి నల్లగండ్లలో ‘శుభప్రదం షాపింగ్ మాల్’ ప్రారంభం

సినీ నటి శృతి హాసన్ సందడి నల్లగండ్లలో ‘శుభప్రదం షాపింగ్ మాల్’ ప్రారంభం

శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి పరిధిలోని నల్లగండ్లలో శుక్రవారం సినీ నటి శృతి హాసన్ సందడి చేశారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన 'శుభప్రదం షాపింగ్ మాల్‌'ను ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆమెను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో మాల్ పరిసర ప్రాంతాలన్నీ కోలాహలంగా మారాయి. ఈ సందర్భంగా శృతి హాసన్ మాట్లాడుతూ.. తనకు భారతీయ సంప్రదాయాలు, సంస్కృతి అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. ముఖ్యంగా మన చేనేత వస్త్రాలకు ఎంతో ప్రత్యేకత ఉందని, వాటిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సంప్రదాయ దుస్తులతో పాటు సందర్భాన్ని బట్టి పార్టీ వేర్ దుస్తులను ధరించడానికి కూడా తాను ఇష్టపడతానని పేర్కొన్నారు. అనంతరం మాల్ నిర్వాహకులు మాట్లాడుతూ.. తమ శుభప్రదం షాపింగ్ మాల్‌లో అన్ని వర్గాల వినియోగదారులకు నచ్చే విధంగా సంప్రదాయ, ఆధునిక దుస్తులను అందుబాటులో ఉంచామని, ప్రారంభోత్సవం సందర్భంగా కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లను కూడా అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాల్ యాజమాన్యం, సిబ్బంది మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.