dharaninews.com Daily News – Andhra, Telangana, Business & Breaking News › జులై 1 నుంచి రేషన్ బియ్యం పంపిణీ: ఏర్పాట్లు పూర్తి… › e-Paper Clip dharaninews.com Daily News – Andhra, Telangana, Business & Breaking News
Share: f 𝕏 ✉ ✈ in @ 📱 WhatsApp
Date of Publish : 29 Jun 2026, 10:53 pm  |  Posted by : DHARANI NEWS
👁 17 💬 0
Telangana > Latest News

జులై 1 నుంచి రేషన్ బియ్యం పంపిణీ: ఏర్పాట్లు పూర్తి చేసిన పౌరసరఫరాల శాఖ

జులై 1 నుంచి రేషన్ బియ్యం పంపిణీ: ఏర్పాట్లు పూర్తి చేసిన పౌరసరఫరాల శాఖ

హైదరాబాద్: తెలంగాణలో రేషన్ కార్డుదారులకు జులై నెల కోటా బియ్యం పంపిణీకి పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జులై 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు ఈ బియ్యాన్ని అందజేయనున్నారు. ఇందుకోసం రేషన్ దుకాణాల డీలర్లకు ముందస్తుగా బియ్యం సరఫరా చేసే ప్రక్రియను అధికారులు ఇప్పటికే ప్రారంభించారు.గతంలో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన మూడు నెలల కోటా బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ ఏప్రిల్ నెలలోనే ఒకేసారి పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా జులై నెలకు సంబంధించిన కోటాను యథావిధిగా ఒక నెల పరిమితితో పంపిణీ చేయనున్నారు. కార్డుదారులు ఆయా రేషన్ దుకాణాలకు వెళ్లి తమకు కేటాయించిన బియ్యాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవచ్చని, పంపిణీ ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది.