dharaninews.com Daily News – Andhra, Telangana, Business & Breaking News › గచ్చిబౌలి-DLF మార్గంలో వెళ్తున్నారా..? 90 రోజుల పాటు రూట్ డైవర్షన్ › e-Paper Clip dharaninews.com Daily News – Andhra, Telangana, Business & Breaking News
Share: f 𝕏 ✉ ✈ in @ 📱 WhatsApp
Date of Publish : 29 Jun 2026, 5:20 pm  |  Posted by : DHARANI NEWS
👁 23 💬 0
Hyderabad > Rangareddy

గచ్చిబౌలి-DLF మార్గంలో వెళ్తున్నారా..? 90 రోజుల పాటు రూట్ డైవర్షన్

గచ్చిబౌలి-DLF మార్గంలో వెళ్తున్నారా..? 90 రోజుల పాటు రూట్ డైవర్షన్

గచ్చిబౌలి: ఐఐఐటీ జంక్షన్ (IIIT Junction) పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మల్టీ లెవల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనుల కారణంగా జులై 1, 2026 నుండి మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కమిషనరేట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నిర్మాణ పనులు దాదాపు ఏడాది పాటు సాగే అవకాశం ఉన్నందున, పనులను వేగవంతం చేసేందుకు గానూ మొదటగా డిఎల్‌ఎఫ్ (DLF) గేట్ నెం.1 నుండి గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వరకు ఉన్న రహదారిని మూడు నెలల పాటు తాత్కాలికంగా మూసివేయనున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారుల సౌకర్యార్థం పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. రేడిసన్ హోటల్ నుండి డిఎల్‌ఎఫ్ మీదుగా ఐఐఐటీ జంక్షన్ వైపు వెళ్లే వాహనాలను డిఎల్‌ఎఫ్ గేట్ నెం.1 వద్ద నిలిపివేస్తారు; వీరు గచ్చిబౌలి జంక్షన్ వద్ద రైట్ టర్న్ తీసుకుని ఇందిరానగర్ మీదుగా ఐఐఐటీ జంక్షన్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. అయితే, నాన్-సెజ్ (Non-SEZ/CMC) గేట్ ద్వారా ప్రయాణించే టీసీఎస్ (TCS) సంస్థ ఉద్యోగుల వాహనాలకు మాత్రం యథావిధిగా అనుమతి ఉంటుంది.మరోవైపు, గచ్చిబౌలి ట్రాఫిక్ పీఎస్ నుండి రేడిసన్ హోటల్ జంక్షన్ వైపు వెళ్లే వారు.. లింగంపల్లి వైపు నుండి వచ్చి డిఎల్‌ఎఫ్ రోడ్డుకు వెళ్లే వాహనాలను గచ్చిబౌలి ట్రాఫిక్ పీఎస్ వద్ద ఐఐఐటీ జంక్షన్, గచ్చిబౌలి జంక్షన్ మీదుగా రేడిసన్ జంక్షన్ వైపునకు మళ్లిస్తారు. ఫ్లైఓవర్ నిర్మాణ ప్రాంతంలో దాదాపు ఏడాది పాటు ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉన్నందున, సాధారణ ప్రజలతో పాటు ఐటీ ఉద్యోగులు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సహకరిస్తూ, తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.