dharaninews.com Daily News – Andhra, Telangana, Business & Breaking News › శేరిలింగంపల్లిలో ఓటర్ల సవరణ ప్రక్రియ ప్రారంభం › e-Paper Clip dharaninews.com Daily News – Andhra, Telangana, Business & Breaking News
Share: f 𝕏 ✉ ✈ in @ 📱 WhatsApp
Date of Publish : 25 Jun 2026, 5:35 pm  |  Posted by : DHARANI NEWS
👁 19 💬 0
Hyderabad

శేరిలింగంపల్లిలో ఓటర్ల సవరణ ప్రక్రియ ప్రారంభం

శేరిలింగంపల్లిలో ఓటర్ల సవరణ ప్రక్రియ ప్రారంభం

శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (ఓటర్ల సమగ్ర సవరణ) ప్రక్రియ గురువారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అధికారికంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని గుల్మార్ పార్క్, నేతాజీ నగర్, డాక్టర్స్ కాలనీ ప్రాంతాల బూత్ లెవల్ అధికారులు (బిఎల్ఓలు) స్థానిక బీఆర్ఎస్ నాయకుడు గుర్లా తిరుమలేష్‌తో కలిసి గుల్మోహర్ పార్క్ లైబ్రరీలో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలోని వివిధ కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా బూత్ లెవల్ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల జాబితాను సరిచూడడం, అర్హులైన కొత్త ఓటర్లను చేర్చడం, మృతులు, వలస వెళ్లినవారు మరియు డూప్లికేట్ పేర్లను జాబితా నుండి తొలగించడం వంటి కార్యక్రమాలపై సమీక్ష జరిపారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు గుర్లా తిరుమలేష్ మాట్లాడుతూ, దాదాపు 25 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ఇలాంటి సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరుగుతోందని, ఇందులో ప్రజల సహకారం అత్యంత కీలకమని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను బిఎల్ఓలు ఈ సమావేశంలో వివరించగా, వాటిని పరిష్కరించడానికి అన్ని విధాలా సహకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే ప్రజలందరూ తమ పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలని, ఏవైనా మార్పులు లేదా సవరణలు ఉంటే సంబంధిత బిఎల్ఓను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ జూలై 24 వరకు కొనసాగుతుందని, ఆ తర్వాత డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేసి, ప్రజల నుండి క్లెయిమ్స్, ఆబ్జెక్షన్స్ స్వీకరిస్తారని తెలిపారు. అన్ని సవరణల అనంతరం అక్టోబర్ 1న తుది (ఫైనల్) ఓటర్ల జాబితాను అధికారికంగా వెల్లడిస్తారని ఆయన వివరించారు.