నేపాల్ వరద బాధితుల కోసం కాఠ్‌మాండ్‌ చేరిన సోనూసూద్.. భారత్ నుంచి సహాయ సామగ్రి సరఫరా!

Dharani News
1 Min Read

కాఠ్‌మాండ్, ధరణి న్యూస్ : గత వారం నేపాల్‌ను ముంచెత్తిన తీవ్రమైన వరదలు అక్కడ అపార నష్టాన్ని మిగిల్చాయి. వేలాది మంది ప్రజలు ఇల్లు, వాకిలి కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఈ కష్టసమయంలో నేపాల్‌ వరద బాధితులకు బాసటగా నిలిచేందుకు ప్రముఖ సినీ నటుడు రియల్ హీరో సోనూసూద్ నేరుగా కాఠ్‌మాండ్‌ చేరుకున్నారు. ఆయన నేతృత్వంలోని టీమ్ అక్కడ క్షేత్రస్థాయిలో దిగి సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటోంది.వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సమయంలో (ఏఎన్‌ఐ) వార్తా సంస్థతో సోనూసూద్ మాట్లాడారు. తమ ‘సోనూసూద్ ఛారిటీ ఫౌండేషన్’ బృందం ద్వారా భారత్ నుంచి అత్యవసర సహాయ సామగ్రిని, ఆహార పదార్థాలను, ఔషధాలను నేపాల్‌కు తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. బాధితుల ఆకలి తీర్చడంతో పాటు వారికి ప్రాథమిక వైద్య సదుపాయాలు అందేలా తమ బృందం పర్యవేక్షిస్తోందని చెప్పారు. అంతేకాకుండా ఈ సహాయం కేవలం కొన్ని రోజులకు మాత్రమే పరిమితం కాదని సోనూసూద్ స్పష్టం చేశారు. బాధితులు తిరిగి సాధారణ జీవితం గడిపే వరకు రాబోయే కొన్ని నెలల పాటు తమ ఫౌండేషన్ తరఫున సహాయక కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. విపత్తు వేళ పక్కదేశపు ప్రజలకు అండగా నిలవడం మన బాధ్యతని ఆయన ఈ సందర్బంగా పేర్కొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article