గచ్చిబౌలి లో వ్యక్తి దారుణ హత్య: కత్తితో పొడిచి చంపిన వంట మనిషి

Dharani News
1 Min Read

గచ్చిబౌలి, ధరణి న్యూస్, సెప్టెంబర్ 11 : రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలోని అంజయ్యనగర్‌లో గురువారం రాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది. ‘హరిహర మెన్స్‌ హాస్టల్’లో క్లీనింగ్ వర్కర్‌గా పనిచేస్తున్న ఒడిశాకు చెందిన శశిధర్ రాజ్ (44)పై సమీపంలోని శివ బాలాజీ హాస్టల్‌లో వంట మనిషిగా పనిచేస్తున్న ఒడిశాకే చెందిన ప్రమోద్ కుమార్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో శశిధర్ ఛాతిలో ఎడమ చేతిపై తీవ్రమైన కత్తిపోట్లుకు గురికావడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. గత రెండు నెలలుగా శశిధర్ తన భార్యతో కలిసి హాస్టల్‌లోనే నివాసముంటున్నాడు. అయితే హత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని పాత కక్షలా లేక క్షణికావేశంలో జరిగిన దాడియా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో లభ్యమైన ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న రాయదుర్గం పోలీసులు.. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీఎన్‌ఎస్ సెక్షన్ 103(1) కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడు ప్రమోద్ కుమార్ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు పోలీస్ లు వేగవంతం చేశారు.

📄 Generate e-Paper Clip
Share This Article